ల్యాండ్ అవుతూ తిరగబడిన విమానం.. తీవ్రంగా గాయపడిన ప్రయాణికులు.. వీడియో ఇదిగో!
- కెనడాలోని టొరొంటో పియర్స్ విమానాశ్రయంలో ఘటన
- క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమం
- బలమైన గాలులే ప్రమాదానికి కారణమని అనుమానం
గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వీరిలో ఒక చిన్నారి కూడా వుంది. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. విమానం మిన్నియాపొలిస్ నుంచి వస్తున్నట్టు అధికారులు తెలిపారు. ప్రమాదం నుంచి చాలామంది ఎలాంటి గాయాలు లేకుండా బయటపడినట్టు పేర్కొన్నారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. తిరగబడిన విమానం నుంచి ప్రయాణికులను రక్షిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.