కులగణనలో పాల్గొనలేదా? ఫోన్ చేస్తే ఇంటికి ఎన్యుమరేటర్లు
- కులగణనలో పాల్గొనని వారి కోసం రేపటి నుండి మరోసారి సర్వే
- టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేస్తే ఇంటికే రానున్న ఎన్యుమరేటర్లు
- ఎంపీడీవో కార్యాలయం, వార్డు కార్యాలయాలకు వెళ్లి కూడా నమోదు చేసుకునే వెసులుబాటు
కుల గణన కోసం టోల్ ఫ్రీ నెంబర్ 040-211-11111ను ఏర్పాటు చేసింది. కుల గణన సర్వే కోసం ఎవరైనా ఫోన్ చేస్తే ఎన్యుమరేటర్లు వారి ఇంటికి వెళ్లి వివరాలను నమోదు చేసుకుంటారు. ఎంపీడీవో కార్యాలయం, వార్డు కార్యాలయాలకు వెళ్లి కూడా వివరాలను నమోదు చేసుకునే అవకాశం కల్పించినట్లు అధికారులు వెల్లడించారు.