ఆసుపత్రిలో నిర్లక్ష్యం.. తల్లిని వీల్‌చైర్‌లో తీసుకెళ్లి ఎమ్మెల్యే ఇంటి ముందు కొడుకు నిరసన!
- ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందడం లేదని ఆవేదన
- అనారోగ్యంతో ఉన్న తల్లిని వీల్‌చైర్‌పై 2 కి.మీ. తీసుకెళ్లిన కొడుకు
- నేరుగా ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు ఇంటి వద్ద నిరసన
- ఎమ్మెల్యే జోక్యంతో స్పందించిన ఆసుపత్రి సిబ్బంది
- బాధితురాలిని తిరిగి ఆసుపత్రికి తరలించి చికిత్స
ప్రభుత్వాసుపత్రిలో తన తల్లికి సరైన వైద్యం అందించడం లేదన్న ఆవేదనతో ఓ కొడుకు వినూత్న నిరసనకు దిగాడు. అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిని వీల్‌చైర్‌పై కూర్చోబెట్టి, ఏకంగా 2 కిలోమీటర్ల మేర తోసుకుంటూ స్థానిక ఎమ్మెల్యే ఇంటికి తీసుకెళ్లాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. మందమర్రి మండలం పులిమడుగు గ్రామానికి చెందిన భుక్యా బుజ్జి అనే మహిళ కొంతకాలంగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నారు. ఆమె కుమారుడు రాజ్‌కుమార్, తల్లిని మెరుగైన వైద్యం కోసం మంగళవారం రాత్రి మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చాడు. అయితే, అక్కడి వైద్య సిబ్బంది తన తల్లిని పట్టించుకోలేదని, వైద్యం అందించడంలో నిర్లక్ష్యం చేశారని రాజ్‌కుమార్ ఆరోపించాడు.
దీంతో తీవ్ర ఆవేదనకు గురైన అతను, తల్లిని వీల్‌చైర్‌లో కూర్చోబెట్టి ఆసుపత్రి నుంచి నేరుగా ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు నివాసానికి బయలుదేరాడు. రాజ్‌కుమార్ అక్కడికి చేరుకునేసరికి ఎమ్మెల్యే ఇంట్లో అందుబాటులో లేరు. దీంతో ఎమ్మెల్యే సిబ్బంది ఫోన్ ద్వారా ఆయనకు విషయం తెలియజేశారు.
వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు, ఆసుపత్రి ఆర్‌ఎంవో శ్రీధర్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. ఎమ్మెల్యే ఆదేశాలతో ఆర్‌ఎంవో వెంటనే బాధితురాలిని తిరిగి ఆసుపత్రికి తరలించి, వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకున్నారు.