తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే అవకాశం
- తెలంగాణలో మరోసారి కులగణన చేయాలని ప్రభుత్వం నిర్ణయం
- స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్న కాంగ్రెస్
- రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందాకే ఎన్నికలు నిర్వహించే అవకాశం
ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఈ క్రమంలో మరోసారి కులగణన చేపట్టి, రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందాకే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని భావిస్తున్నారు.