India vs England: మూడో వ‌న్డేలో టాస్ గెలిచిన ఇంగ్లండ్‌... మూడు మార్పుల‌తో బ‌రిలోకి భార‌త్‌!

England Won the Toss and Chose to Field in 3rd ODI at Ahmedabad
షార్ట్స్‌లో చూడండి
అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రుగుతున్న మూడో వ‌న్డేలో మొద‌ట టాస్ గెలిచిన ఇంగ్లండ్ జ‌ట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా మూడు మార్పుల‌తో బ‌రిలోకి దిగింది. ర‌వీంద్ర జ‌డేజా, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ స్థానాల్లో వాషింగ్ట‌న్ సుంద‌ర్‌, కుల్దీప్ యాద‌వ్‌, అర్ష్‌దీప్ సింగ్ జ‌ట్టులోకి వ‌చ్చారు. అటు ఇంగ్లండ్ ఒక మార్పు చేసింది. జేమీ ఒవ‌ర్ట‌న్ స్థానంలో టామ్ బాంట‌న్ ను తీసుకుంది.

ఇప్ప‌టికే మూడు వ‌న్డేల సిరీస్ ను భార‌త్ 2-0తో కైవ‌సం చేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ మ్యాచ్ లోనూ గెలిచి క్లీన్ స్వీప్ చేయాల‌ని భార‌త్ చూస్తోంది. ఇంగ్లీష్ జ‌ట్టు మాత్రం ఈ ఆఖ‌రి మ్యాచ్‌లోనైనా విజ‌యం సాధించి ప‌రువు నిల‌బెట్టుకోవాల‌ని భావిస్తోంది. 

కాగా, టాస్ ఓడి మొద‌ట బ్యాటింగ్‌కు దిగిన భార‌త జ‌ట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ త‌గిలింది. రెండో వ‌న్డేలో అద్భుత‌మైన సెంచ‌రీతో అద‌రగొట్టిన కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఈ మ్యాచ్ లో ఒక్క ప‌రుగుకే వెనుదిరిగాడు. దీంతో టీమిండియా 6 ర‌న్స్ కే తొలి వికెట్ కోల్పోయింది. ప్ర‌స్తుతం క్రీజులో గిల్ (5), కోహ్లీ (5) ఉండ‌గా... భార‌త్ స్కోరు: 17/1 (4 ఓవ‌ర్లు).  

భార‌త జ‌ట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్‌ రాహుల్ (వికెట్ కీప‌ర్‌), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా.

ఇంగ్లండ్ జ‌ట్టు: ఫిల్ సాల్ట్ (వికెట్ కీప‌ర్‌), బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (కెప్టెన్), టామ్ బాంటన్, లియామ్ లివింగ్‌స్టన్, గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, సకిబ్ మహమూద్.
Go Back to Shorts
India vs England
3rd ODI
Ahmedabad
Team India
Cricket
Sports News

More Telugu News