మల్లన్న బ్రహ్మోత్సవాలకు చంద్రబాబు.. ఈరోజు శ్రీశైలంకు వెళుతున్న ఆరుగురు మంత్రులు
- ఈనెల 19 నుంచి మార్చి 1 వరకు శ్రీశైలం బ్రహ్మోత్సవాలు
- ఈనెల 23న శ్రీశైలంకు వెళుతున్న చంద్రబాబు
- శివరాత్రి ఏర్పాట్లను ఈరోజు పరిశీలించనున్న మంత్రుల బృందం
మరోవైపు మహాశివరాత్రి ఏర్పాట్లను పరిశీలించేందుకు రాష్ట్ర మంత్రుల బృందం ఈరోజు శ్రీశైలంకు వెళ్లనుంది. మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, ఫరూక్, అనిత శ్రీశైలంలో పర్యటించనున్నారు.
శ్రీశైలంను ఆథ్యాత్మిక నగరంగా తీర్చి దిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. విదేశీ యాత్రికులను సైతం ఆకట్టుకునేలా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయడంపై దృష్టి సారించింది. విడతల వారీగా వసతులను మెరుగు పరిచేందుకు కన్సల్టెన్సీల ద్వారా ప్రణాళికలు రూపొందించాలని నిర్ణయించింది.