పుష్ప-2 మూవీ టీం ఎంత పన్ను చెల్లించిందో తెలుసా?
- సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు సేకరించిన సీపీఎం నేత
- నెలవారీ రిటర్న్స్‌ను సమర్పించిన మూవీ నిర్మాతలు
- రూ.110 కోట్ల పన్ను చెల్లించిన నిర్మాతలు
- ప్రత్యేకంగా పుష్ప-2కు సంబంధించి చెల్లించారని చెప్పలేమన్న అధికారులు
ఈ సినిమాకు సంబంధించి నెలవారీ జీఎస్టీఆర్-3బీ, జీఎస్టీఆర్-01 రిటర్న్స్‌ను కమర్షియల్ ట్యాక్స్ శాఖకు సమర్పించారు. ఇందులో సినిమాకు సంబంధించిన వాటితో పాటు ఇతర రిటర్న్స్ కూడా ఉండవచ్చునని అధికారులు వెల్లడించారు.
ప్రత్యేకంగా పుష్ప-2 సినిమాకు సంబంధించిన రెవెన్యూ బ్రేకప్ చెప్పలేమని, కానీ వారి నుండి నవంబర్, డిసెంబర్ నెలలకు గాను వచ్చిన పన్నులు మాత్రం రూ.110 కోట్ల వరకు ఉన్నట్లు తెలిపారు. ఈ రెండు నెలల టర్నోవర్ రూ.642 కోట్లుగా వెల్లడించారు. ఇందులో సినిమా శాటిలైట్ రైట్స్ అమ్మకం, ఓటీటీ రైట్స్, ఓవర్సీస్ ఆడియో రైట్స్ ద్వారా వచ్చిన ఆదాయం కూడా ఉండవచ్చునని తెలిపారు.