హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ నిర్వహణపై లోకేశ్ అసంతృప్తి.. సొంత నిధులతో మరమ్మతులు
- ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద లోకేశ్ నివాళి
- ఘాట్ గోడలు, పైకప్పు పెచ్చులూడిపోవడం, లైట్లు విరిగిపోవడం గుర్తించిన ఏపీ మంత్రి
- సొంత నిధులతో త్వరగా మరమ్మతులు ప్రారంభించాలని తన సిబ్బందికి ఆదేశం
ఎన్టీఆర్ ఘాట్ వద్ద గోడలు, పైకప్పు పెచ్చులూడిపోవడం, గార్డెన్‌లో ఏర్పాటు చేసిన లైట్లు విరిగిపడి ఉండటాన్ని లోకేశ్ గమనించారు. ఈ ఘాట్ మరమ్మతుల కోసం అవసరమైన అనుమతులు తీసుకొని సాధ్యమైనంత తొందరగా పనులు ప్రారంభించాలని లోకేశ్ నిర్ణయించారు.
సొంత నిధులతో ఈ పనులు చేయించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి పనులను వెంటనే ప్రారంభించాలని తన సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఘాట్ నిర్వహణ బాధ్యతలను ఎన్టీఆర్ ట్రస్ట్‌కు అప్పగించాలని తాము గతంలోనే తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని లోకేశ్ ఈ సందర్భంగా తెలిపారు.