ఛాంపియన్స్ ట్రోఫీకి టీమిండియాను ప్రకటించిన బీసీసీఐ... బుమ్రా ఫిట్, తిరిగొచ్చిన షమీ

BCCI announces Team India for Champions Trophy
  • ఫిబ్రవరి 19 నుంచి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ
  • పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా మెగా ఈవెంట్
  • రోహిత్ శర్మ కెప్టెన్ గా టీమిండియా జట్టు ఎంపిక
ఫిబ్రవరి 19 నుంచి పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మెగా టోర్నమెంట్ లో ఆడే భారత జట్టును నేడు ఎంపిక చేశారు. నేడు ముంబయిలో 15 మందితో కూడిన టీమిండియా ఎంపికపై బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది. 

ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా కెప్టెన్ గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ గా శుభ్ మాన్ గిల్ వ్యవహరిస్తారని ఆ ప్రకటనలో వెల్లడించింది. జస్ప్రీత్ బుమ్రా గాయం నయం కావడంతో అతడికి కూడా ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో స్థానం కల్పించారు. ఇక గాయాల కారణంగా సుదీర్ఘకాలంగా జట్టుకు దూరంగా ఉన్న స్టార్ పేసర్ మహ్మద్ షమీ, శ్రేయాస్ అయ్యర్ లకు కూడా చోటిచ్చారు. 

ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడే టీమిండియా ఇదే...
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్ మాన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్.
Advertisement
Team India
Champions Trophy
BCCI
Pakistan
Dubai

More Telugu News