ఒకే పోస్టర్‌లో చంద్రబాబు, బాలయ్య, కేసీఆర్.. నెట్టింట వైరల్ అవుతున్న ఫ్లెక్సీ!
ఈ ఫ్లెక్సీలో కేటీఆర్, మంత్రి నారా లోకేశ్, జూనియర్ ఎన్‌టీఆర్, మోక్షజ్ఞ ఫొటోలు కూడా ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్ర సరిహద్దులో ఉండే ఖమ్మం జిల్లా ముగ్గు వెంకటాపురంలో ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అటుగా వెళ్లిన కొందరు ఈ పోస్టర్‌ను ఫొటో తీసి, నెట్టింట పెట్టడంతో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.