ఫార్ములా ఈ-కార్ కేసులో కీలక పరిణామం... సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ వేసిన తెలంగాణ ప్రభుత్వం
- కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు
- సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో కేటీఆర్
- కేటీఆర్ పిటిషన్ వేస్తే.. తమ వాదనలను కూడా వినాలంటూ ప్రభుత్వం పిటిషన్
మరోవైపు కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి ముందే తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఒకవేళ కేటీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే... తెలంగాణ ప్రభుత్వ వాదనలను కూడా వినాలని పిటిషన్ లో కోరింది.