కాకినాడ తీరంలో ఆలివ్ రిడ్లే తాబేళ్ల మరణం... విచారణకు ఆదేశించిన పవన్ కల్యాణ్
- ఆలివ్ రిడ్లే తాబేళ్ల మరణానికి కారణాలు తెలుసుకోవాలన్న పవన్
- కారకులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు
- వన్యప్రాణుల పరిరక్షణ చర్యలపై సమగ్ర అధ్యయనం చేయాలని సూచన
కాకినాడ తీరంలో ఆలివ్ రిడ్లే తాబేళ్ల మరణాలపై విచారణ చేపట్టాలని అటవీశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. అరుదైన జాతికి చెందిన ఆ తాబేళ్ల మరణానికి కారణాలు తెలుసుకోవాలని స్పష్టం చేశారు. ఆలివ్ రిడ్లే తాబేళ్ల మరణానికి కారకులపై చర్యలు తీసుకోవాలని పవన్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. వన్యప్రాణుల పరిరక్షణ చర్యలపై సమగ్ర అధ్యయనం చేయాలని సూచించారు.