సెలబ్రెటీల పాపులర్ లిస్ట్ లో శోభిత తర్వాతే సమంత
- మోస్ట్ పాపులర్ స్టార్స్ జాబితా విడుదల చేసిన ఐఎండీబీ
- ఈ ఏడాది ఎక్కువగా త్రిప్తి డిమ్రీ కోసం వెతికారని వెల్లడి
- బ్యాడ్ న్యూజ్, లైలా మజ్ను చిత్రాల్లో నటించిన త్రిప్తి డిమ్రీ టాపర్
ఈ జాబితాలో రెండో స్థానంలో దీపికా పదుకొణే, మూడో స్థానంలో ఇషాన్ ఖత్తర్, నాలుగో స్థానంలో షారుక్ ఖాన్ నిలిచారు. ఐదో స్థానంలో శోభిత ధూళిపాళ ఉన్నారు. చైతూతో పెళ్లితో పాటు ఆమె నటించిన మంకీ మ్యాన్ విడుదల సందర్భంగా నెటిజన్లు ఆమె కోసం ఎక్కువగా సెర్చ్ చేశారని ఐఎండీబీ వెల్లడించింది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా శార్వరీ, ఐశ్వర్య రాయ్ ఉండగా ఎనిమిదో ర్యాంక్ ను సమంత దక్కించుకున్నారు. సమంత నటించిన ‘సిటడెల్: హనీ బన్నీ’ విడుదల, హీరోయిన్ అనారోగ్యం తదితర కారణాలతో నెటిజన్లు ఆమె కోసం ఎక్కువగా వెతికారని ఐఎండీబీ వెల్లడించింది.