‘శివాజీ’లో ప్రముఖ నటుడు ఇక లేరు.. రజనీకాంత్ తీవ్ర దిగ్భ్రాంతి
- ప్రముఖ తమిళ పండితుడు సోలమన్ పప్పయ్య మృతి
- వయోభారంతో 90 ఏళ్ల వయసులో కన్నుమూత
- 12 వేలకుపైగా చర్చలకు వ్యాఖ్యాతగా సేవలు
- చర్చలను సామాన్య ప్రజలకు చేరువ చేశారన్న రజనీకాంత్
- ‘శివాజీ-ది బాస్’లో నటించిన పప్పయ్య
ప్రముఖ తమిళ పండితుడు, పట్టిమండ్రం (చర్చా వేదిక) వ్యాఖ్యాత, నటుడు సోలమన్ పప్పయ్య కన్నుమూశారు. వయోభారంతో వచ్చిన అనారోగ్య సమస్యలతో మధురైలో శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 90 ఏళ్లు.
సోలమన్ పప్పయ్య మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమిళంలో తన ‘ఎక్స్’ ఖాతాలో స్పందించిన ఆయన.. గొప్ప తమిళ పండితుడు ప్రొఫెసర్ సోలమన్ పప్పయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
చర్చలను సామాన్య ప్రజలకు చేరువ చేయడంలో పప్పయ్య కీలక పాత్ర పోషించారని రజనీకాంత్ గుర్తుచేశారు. అప్పటివరకు విద్యావంతులు, ఉన్నత వర్గాలకే పరిమితమైన చర్చా కార్యక్రమాలను ఆయన సులభమైన, సామాన్యుల భాషలో ప్రజల్లోకి తీసుకెళ్లారని కొనియాడారు.
సోలమన్ పప్పయ్య 12 వేలకుపైగా చర్చా కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. తమిళంలో తనదైన శైలితో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. పలు సినిమాల్లోనూ నటించారు. రజనీకాంత్ నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘శివాజీ-ది బాస్’లోనూ ఆయన కనిపించారు.