నవంబర్ 30 నుంచి డిసెంబర్ 7 వరకు బీఆర్ఎస్ 'గురుకుల బాట': కేటీఆర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నవంబర్ 30 నుంచి డిసెంబర్ 7 వరకు బీఆర్ఎస్ 'గురుకుల బాట': కేటీఆర్

KTR announces BRS gurukul bata from Nov 30 to Dec 7
  • గురుకులాలు, కేజీబీవీ, మోడల్ స్కూల్స్, కాలేజీలను పరిశీలించనున్న బీఆర్ఎస్
  • గురుకుల, పాఠశాల విద్యను రేవంత్ సర్కార్ సంక్షోభంలోకి నెట్టిందని విమర్శ
  • సీఎం ఢిల్లీకి తిరిగేందుకే సమయం సరిపోవడం లేదని ఎద్దేవా
  • ఆర్ఎస్ ప్రవీణ్ నేతృత్వంలో అధ్యయన కమిటీ వేస్తున్నట్లు వెల్లడి
నవంబర్ 30 నుంచి డిసెంబర్ 7 వరకు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ గురుకుల బాట కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. గురుకుల బాట కార్యక్రమంలో భాగంగా గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, కాలేజీలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నాయకులు పరిశీలిస్తారు.

గురుకుల, పాఠశాల విద్యను రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంక్షోభంలోకి నెట్టిందని కేటీఆర్ ఆరోపించారు. 11 నెలల్లో 52 మంది విద్యార్థుల మృతి చెందారని, ఇందులో 38 ఫుడ్ పాయిజన్ సంఘటనలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాలన గాలికొదిలేసి నేరపూరిత నిర్లక్ష్యంతో ఈ ముఖ్యమంత్రి విద్యార్థులను పొట్టన పెట్టుకున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి కనీసం విద్యాశాఖ మంత్రి లేడన్నారు. అయినా సీఎం ఢిల్లీకి తిరిగేందుకే సమయం సరిపోవడం లేదని ఎద్దేవా చేశారు.

విద్యార్థులు చనిపోతున్నప్పటికీ ఒక్క సమీక్ష నిర్వహించని ప్రభుత్వానికి ఉసురు తప్పదని హెచ్చరించారు. గురుకులాలు, కేజీబీవీ, మోడల్ స్కూళ్ల పరిస్థితులను అధ్యయనం చేసేందుకు బీఆర్ఎస్ తరఫున అధ్యయన కమిటీ వేస్తున్నామన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యులతో గురుకుల అధ్యయన కమిటీ వేస్తున్నట్లు తెలిపారు. గురుకులాలను పరిశీలించి ఈ కమిటీ నివేదిక ఇస్తుందన్నారు. ఈ అంశాలను తాము అసెంబ్లీలో లేవనెత్తుతామన్నారు.
Advertisement
KTR
RS Praveen Kumar
BRS
Congress
Telangana

More Telugu News