వైఎస్సార్ కు మరణం లేదు: షర్మిల

YS Sharmila says YSR has no death
  • తన తండ్రి జయంతి సందర్భంగా నివాళి అర్పించిన షర్మిల
  • వైఎస్ అమలు చేసిన పథకాలు ప్రతి గడపకు అందాయని ప్రశంస
  • ఆయన మరణం తట్టుకోలేక 700 మంది ఆయనతో పాటే వెళ్లిపోయారని వ్యాఖ్య
తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... 'వైఎస్సార్ లెజెండరీ లీడర్. ఆయనకు మరణం లేదు' అని షర్మిల అన్నారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా కేవలం 5 ఏళ్లు మాత్రమే పని చేసినా... ఆయన చేసిన అభివృద్ధి, అమలు చేసిన పథకాలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి గడపకు అందాయని ప్రశంసించారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉచిత విద్యుత్, జలయజ్ఞం వంటి పథకాలను వైఎస్సార్ మనసు పెట్టి అమలు చేశారని తెలిపారు. ఆయన మరణాన్ని తట్టుకోలేక ఆ సమయంలో 700 మంది ఆయన వెంటే వెళ్లిపోయారని అన్నారు.
Advertisement
YS Rajasekhara Reddy
YS Sharmila
YSR Birth Anniversary
AP Congress
YSR Welfare Schemes
Andhra Pradesh Politics

More Telugu News