సీఐడీ మాజీ అధికారి విజయపాల్ ను రేపు గుంటూరు తరలించనున్న పోలీసులు
- రఘురామను చిత్రహింసలు పెట్టిన కేసులో విజయపాల్ అరెస్ట్
- ఈ రాత్రికి ఒంగోలు పీఎస్ లోనే విజయపాల్!
- రిమాండ్ రిపోర్టు సిద్ధం చేసిన పోలీసులు
ఈ కేసులో విజయపాల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నేడు ఉదయం 11 గంటల నుంచి ఆయనను ప్రశ్నించారు. సుదీర్ఘ విచారణ అనంతరం ఆయనను అరెస్ట్ చేశారు. విజయపాల్ రిమాండ్ రిపోర్టును పోలీసులు సిద్ధం చేశారు. రేపు ఆయనను కోర్టులో హాజరుపరిచే అవకాశాలున్నాయి.