ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్న చంద్రబాబు, బాలకృష్ణ
- ఈ మధ్యాహ్నం ఏఐజీ ఆసుపత్రిలో కన్నుమూసిన రామ్మూర్తినాయుడు
- ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకుని హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు
- నారావారిపల్లెలో రేపు రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు
కాసేపటి క్రితమే నందమూరి బాలకృష్ణ కూడా ఆసుపత్రి వద్దకు వచ్చారు. పురందేశ్వరితో పాటు నారా, నందమూరి కుటుంబసభ్యలు ఆసుపత్రి వద్ద ఉన్నారు. తన చిన్నాన్న ఆరోగ్యం విషమించిందన్న వార్త తెలియగానే... నారా లోకేశ్ హుటాహుటిన ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి హైదరాబాద్ కు చేరుకున్నారు.
ఇంకోవైపు, చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెలో రేపు రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబసభ్యులు ప్రకటించారు.