డీజే టిల్లు పాటకు స్టెప్పులు ఇరగదీసిన మాజీ మంత్రి మల్లారెడ్డి... వీడియో చూడండి!

డీజే టిల్లు పాటకు స్టెప్పులు ఇరగదీసిన మాజీ మంత్రి మల్లారెడ్డి... వీడియో చూడండి!

Malla Reddy dance in grand daughters sangeet
  • ఈ నెల 27న మల్లారెడ్డి మనవరాలి వివాహం
  • సంగీత్ కార్యక్రమంలో అదిరిపోయే స్టెప్పులు వేసిన మల్లారెడ్డి
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి ఏడు పదుల వయసులో కూడా ఎంతో ఉత్సాహంగా ఉంటారు. ఆయన ఏది చేసినా, ఏం మాట్లాడినా వైరల్ అవుతుంటుంది. తాజాగా ఆయన మరోసారి వార్తల్లోకి ఎక్కారు. 

తన మనవరాలి పెళ్లి సంగీత్ కార్యక్రమంలో డ్యాన్స్ ని ఇరగదీశారు. వైట్ కలర్ సూటుబూటులో మరికొందరితో కలిసి ఆయన అదిరిపోయే స్టెప్పులు వేశారు. తన మనవరాలు, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కూతురు వివాహం ఈ నెల 27న జరగనుంది. ఈ పెళ్లి సంగీత్ కార్యక్రమంలో ఆయన 'డీజే టిల్లు' పాటకు డ్యాన్స్ చేశారు. 

మల్లారెడ్డి  డ్యాన్స్ కు చెందిన వీడియో సోషల్ మీడియో వైరల్ అవుతోంది. ఈ వయసులో కూడా మల్లారెడ్డి చేసిన డ్యాన్స్ చూసిన వారందరూ ఆశ్చర్యపోతున్నారు.
Advertisement
Ch Malla Reddy
BRS

More Telugu News