Advertisement

"నేను ఏదైనా ప్రాబ్లంకి కనెక్ట్ అయితే"... గోపీచంద్ 'విశ్వం' థియేట్రికల్ ట్రైలర్ విడుదల

Gopichand starrer Viswam theatrical trailer out now
  • గోపీచంద్, కావ్యా థాపర్ జంటగా 'విశ్వం'
  • అదిరిపోయే రేంజిలో థియేట్రికల్ ట్రైలర్
  • అక్టోబరు 11న 'విశ్వం' గ్రాండ్ రిలీజ్
గోపీచంద్, కావ్యా థాపర్ జంటగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం 'విశ్వం'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్, వేణు దోనెపూడి ఈ చిత్రాన్ని నిర్మించారు. 

తాజాగా ఈ చిత్రం నుంచి థియేట్రికల్ ట్రైలర్ రిలీజైంది. శ్రీను వైట్ల ట్రేడ్ మార్క్ ఎంటర్టయిన్ మెంట్ కు లోటు లేదని థియేట్రికల్ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. గోపీచంద్ కు ఉన్న యాక్షన్ ఇమేజ్ ను దృష్టిలో ఉంచుకుని పవర్ ఫుల్ ఎలిమెంట్స్ ను జోడించినట్టు ట్రైలర్ చెబుతోంది. కామెడీ సరేసరి... వెన్నెల కిశోర్, పృథ్వీ, రాహుల్ రామకృష్ణ, ప్రగతి ఉండడంతో పంచ్ డైలాగులకు లోటు లేదు.  

"నేను ఏదైనా ప్రాబ్లంకి కనెక్ట్ అయితే...  చివరిదాకా నిలబడడం నా బలహీనత" అంటూ హీరో క్యారెక్టర్ ను ఎలివేట్ చేసే డైలాగులతో ట్రైలర్ ఆసక్తి రేకెత్తిస్తోంది. 

విశ్వం చిత్రం అక్టోబరు 11న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇందులో జిషుసేన్ గుప్తా, నరేశ్, సునీల్, కిక్ శ్యామ్, వీటీవీ గణేశ్, శ్రీకాంత్ అయ్యంగార్, ముఖేశ్ రిషి తదితరులు కూడా నటించారు. ఈ యాక్షన్ ఎంటర్టయినర్ మూవీకి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు.
Advertisement
Viswam
Theatrical Trailer
Gopichand
Kavya Thapar
Tollywood

More Telugu News