సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా రాజకీయం చేస్తున్నారు: జగన్
- తిరుమల లడ్డూ వ్యవహారంపై జగన్ ట్వీట్
- లడ్డూ ప్రసాదంపై టీడీపీ రాజకీయాన్ని కొనసాగిస్తోందని మండిపాటు
- నిన్న ప్రెస్ మీట్ లో కూడా చంద్రబాబుపై జగన్ విమర్శలు
నిన్న నిర్వహించిన మీడియా సమావేశంలో కూడా సీఎం చంద్రబాబుపై జగన్ విమర్శలు గుప్పించారు. సుప్రీంకోర్టు మీకు మొట్టికాయలు వేస్తూ తీర్పును వెలువరించిందని... అయినా సిగ్గు లేకుండా తీర్పును వక్రీకరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. లడ్డూ కల్తీ వ్యవహారంలో సుప్రీంకోర్టు సీరియస్ అయిందని... అయినా అబద్ధం మీద అబద్ధం చెప్పుకుంటూ పోతున్నారని దుయ్యబట్టారు. మనిషి అన్నాక కొద్దిగానైనా దైవ భక్తి ఉండాలని అన్నారు.