కొండా సురేఖ వ్యాఖ్యలు... ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం

RS Praveen Kumar fires at Konda Surekha comments
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... కొండా సురేఖ మంత్రి పదవికి అనర్హురాలు అన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలపై లీగల్‌గా ముందుకు వెళ్తామన్నారు. కొండా సురేఖ తన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆమె వ్యాఖ్యలు కాంగ్రెస్ నీచ సంస్కృతికి నిదర్శనమన్నారు.

రేవంత్ రెడ్డి పాలనలో అరాచకాలు, అశాంతి, అభద్రతాభావం పెరుగుతున్నాయని ఆరోపించారు. నిన్న హైదరాబాద్ నడిబొడ్డున పట్టపగలే కేటీఆర్ కాన్వాయ్ మీద కాంగ్రెస్ గూండాలు దాడికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ కాన్వాయ్‍‌‌పై దాడి జరిగి ఇరవై నాలుగు గంటలు దాటినా నిందితులను ఎందుకు అరెస్ట్ చేయలేదని నిలదీశారు.

కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ భవన్ వద్దకు వచ్చి దిష్టిబొమ్మను దగ్ధం చేస్తుంటే బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారని, కానీ వారిపై కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి మా కార్యాలయంపై దాడి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయడం లేదో చెప్పాలన్నారు.
Go Back to Shorts
RS Praveen Kumar
Konda Surekha
KTR

More Telugu News