యూట్యూబర్ హర్షసాయి కేసు.. లీకైన ఆడియో ఇదిగో!
- ఓ ఆడియోలో క్లోజ్ గా మాటలు.. మరో ఆడియోలో ఫైటింగ్
- పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడంటూ హర్షసాయిపై యువతి ఆరోపణలు
- ఆడియో రికార్డింగ్ లు పోలీసులకు అందజేసి ఫిర్యాదు
తాజాగా ఈ కేసుకు సంబంధించి బాధిత యువతికి, హర్షసాయికి మధ్య జరిగిన పలు ఫోన్ కాల్స్ రికార్డులు లీక్ అయ్యాయి. ఈ ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రెండు కాల్స్ కు సంబంధించిన ఆడియోలు ట్విట్టర్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో ఒకదాంట్లో బాధిత యువతి, హర్షసాయి మధ్య ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. ఇద్దరూ గట్టిగా వాదించుకోవడం వినిపిస్తోంది. మరో ఆడియోలో బాధిత యువతి హర్షసాయితో క్లోజ్ గా మాట్లాడగా.. హర్షసాయి ‘ఊ ఆ’ అంటూ సరిపెట్టడం వినిపించింది. ఈ ఆడియోలను బాధితురాలు పోలీసులకు అందజేసినట్లు తెలుస్తోంది. కేసుకు సంబంధించి మరిన్ని ఆధారాలు ఇవ్వాలంటూ పోలీసులు కోరారని సమాచారం.