ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అతిశీ
- సీఎంగా ప్రమాణం చేయిచిన లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా
- ప్రమాణ స్వీకారానికి హాజరైన కేజ్రీవాల్
- కల్కాజీ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న అతిశీ
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ కావడం తెలిసిందే. కొన్ని నెలలు తీహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్ ఇటీవలే బెయిల్ మీద విడుదలయ్యారు. జైలు నుంచి విడుదలైన తర్వాత ఆయన తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో అతిశీ సీఎంగా ప్రమాణం చేశారు.
అతిశీ కల్కాజీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమె ఇంతకుముందు కేజ్రీవాల్ కేబినెట్‌లో ఏకైక మహిళా మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత సెప్టెంబర్ 17న జరిగిన పార్టీ శాసనసభ్యుల సమావేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు అతిశీని సీఎంగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
కాగా, ఢిల్లీ సీఎం పీఠం ఎక్కిన అతి పిన్న వయస్కురాలిగా అతిశీ ఘనత అందుకున్నారు.