మీకు ఇంకా సిగ్గు రాలేదు: విజయసాయిరెడ్డిపై బుద్దా వెంకన్న ఫైర్
- జైల్లో ఉండొచ్చిన మీరు మాకు నీతులు చెపుతారా? అంటూ వెంకన్న మండిపాటు
- మీరు దొంగలు కాదు... గజదొంగలంటూ విమర్శ
- 10 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ వైపు చూస్తున్నారని వ్యాఖ్య
ట్విట్టర్ లో పోస్టులు పెట్టడం కాదని... దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని బుద్దా వెంకన్న సవాల్ విసిరారు. మీరు ఇంగ్లీష్, హిందీలో ఎందుకు పోస్టులు పెడుతున్నారో అందరికీ తెలుసని అన్నారు.
వరద బాధితులకు అండగా ఎంతో మంది పారిశ్రామికవేత్తలు స్పందించి రూ. 350 కోట్ల విరాళాలను సీఎం రిలీఫ్ ఫండ్ కు అందించారని... జగన్ అధికారంలో ఉన్నప్పుడు మిమ్మల్ని నమ్మి ఎవరైనా ఒక్క రూపాయైనా ఇచ్చారా? అని ఎద్దేవా చేశారు. మీరు దొంగలు కాదు... గజ దొంగలని అన్నారు.
వైఎస్సార్ తో కలిసి నడిచిన బాలినేని, సామినేని ఉదయభాను ఇప్పుడు ఎక్కడున్నారని వెంకన్న ప్రశ్నించారు. సీనియర్లు మీకు ఛీకొట్టి పార్టీ నుంచి బయటకు వస్తున్నా మీకు సిగ్గు రావడం లేదని అన్నారు. వైసీపీకి ఉన్న 11 మంది ఎమ్మెల్యేలలో 10 మంది టీడీపీ వైపు చూస్తున్నారని చెప్పారు. మీతో పాటు మీ అధినేత జగన్, మరికొందరు వైసీపీ నేతలు త్వరలోనే జైలుకు వెళతారని అన్నారు.