రాజమౌళి-మహేశ్ బాబు సినిమా టైటిల్ ఇదేనా...?

buzz is that ssmb29 might be titled garuda
  • సినిమా టైటిల్ 'గరుడ' అంటూ సోషల్ మీడియాలో ప్రచారం  
  • న్యూ మూవీలో సరికొత్త అవతారంలో దర్శనమివ్వనున్న మహేశ్
  • సినిమాకి సంబంధించిన లుక్ కోసం సిద్ధమవుతున్న మహేశ్‌ బాబు
మహేశ్ బాబు హీరోగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యాక్షన్ అడ్వంచర్స్ మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. అయితే మహేశ్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా గురించి ఏమైనా అప్ డేట్ వస్తుందని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ అభిమానులకు నిరాశే ఎదురైంది. చిత్ర బృందం దృష్టి అంతా  #SSMB29కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులపైనే ఉంది. 
 
ఈ తరుణంలో ఓ ఆసక్తికరమైన హింట్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. విజువల్ డెవలప్ మెంట్ ఆర్టిస్ట్ టీపీ విజయన్ తన ఇన్ స్టాలో చేసిన పోస్ట్ ఇందుకు కారణం అయింది. బంగారు వర్ణంలో ఉన్న గద్ద రెక్కలను తన ఇన్ స్టా స్టోరీస్ లో ఉంచి #SSMB29, #SSMB29DIARIES అని పేర్కొన్నాడు. దీంతో మహేశ్‌ బాబు కొత్త సినిమాకు గరుడ అనే టైటిల్ పెట్టనున్నారంటూ వార్తలు షికారు చేస్తున్నాయి. 

అయితే ఈ గరుడ ప్రాజెక్టు కొత్తదేమీ కాదు. గతంలో రాజమౌళినే స్వయంగా ప్రకటించారు. బాహుబలి మూవీ తర్వాత తాను చేయబోయే ప్రాజెక్టు అదేనని కూడా రాజమౌళి తెలిపారు. అయితే అందుకు సంబంధించిన పూర్తి వివరాలను మాత్రం వెల్లడించలేదు. అప్పుడు రాజమౌళి మనసులో ఉన్న గరుడ ఇదేనా? కాదా? అన్నదానిపై క్లారిటీ లేదు. ఈ మూవీలో మహేశ్‌బాబు ఓ సరికొత్త అవతారంలో అభిమానులకు కనిపించనున్నారు. ఇప్పటికే మహేశ్ సినిమాకు సంబంధించిన లుక్ కోసం సిద్ధమవుతున్నారు. పొడవాటి జుట్టు, గడ్డంతో ఇప్పటి వరకూ కనిపించని కొత్త గెటప్ లో కనిపించనున్నారు.  కాగా, విజయన్ పోస్టుతో గరుడ మళ్లీ వార్తల్లోకి రాగా దీనిపై చిత్ర బృందం నుండి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు.
Go Back to Shorts
Mahesh Babu
Rajamouli
Movie News

More Telugu News