జోగి రమేశ్ విచారణకు సహకరించడం లేదు... గుర్తుకు లేదు, తెలియదని చెబుతున్నారు: మంగళగిరి డీఎస్పీ
- అవసరమైతే మళ్లీ విచారణకు పిలుస్తామని వెల్లడి
- 94 బీఎన్ఎస్ఎస్ చట్టం ప్రకారం ఏ వ్యక్తి నుంచైనా సమాచారం రాబట్టుకోవచ్చన్న డీఎస్పీ
- కేసు విచారణ మధ్యలో ఉంది... మరింత విచారణ చేయాల్సి ఉందని వెల్లడి
అవసరమైతే జోగి రమేశ్‌ను మళ్లీ విచారణకు పిలుస్తామని తెలిపారు. 94 బీఎన్ఎస్ఎస్ చట్టం ప్రకారం విచారణలో భాగంగా ఏ వ్యక్తిని అయినా కావాల్సిన డాక్యుమెంట్లను గానీ, ఎలక్ట్రానిక్ డివైజ్‌లను గానీ అడిగే అధికారం ఉందన్నారు. ఈ చట్టం ప్రకారం ఏ వ్యక్తినుంచైనా కావాల్సిన సమాచారాన్ని రాబట్టుకునే అధికారం పోలీసులకు ఉందన్నారు. కేసు విచారణ మధ్యలో ఉందని, మరింత విచారణ చేయాల్సి ఉందన్నారు.