భారత రెజ్లింగ్ సంఘంపై వినేశ్ ఫొగాట్ భర్త సంచలన ఆరోపణలు
- ఫొగాట్‌కు భారతీయుల నుంచి, సహచరుల నుంచి మద్దతు లభించిందన్న భర్త
- భారత రెజ్లింగ్ సంఘం నుంచి మద్దతు లభించలేదని ఆరోపణ
- వినేశ్ ఫొగాట్ రిటైర్మెంట్‌పై ప్రశ్నించగా భర్త నుంచి స్పందన లేని వైనం
యావత్ భారతం ఫొగాట్‌పై అభిమానం కురిపిస్తోందని, దీనిని తాము ఊహించలేదన్నారు. సహచరుల నుంచి కూడా మంచి మద్దతు లభించిందన్నారు. ఇంతటి అభిమానం కురిపిస్తున్నందుకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదన్నారు. కొద్దిలో పతకం చేజారిందని... ఆ తర్వాత సీఏఎస్‌లోనూ మనకు వ్యతిరేకంగా తీర్పు వచ్చిందని, ఇలాంటి పరిస్థితుల్లో రెజ్లింగ్ సంఘం అండగా నిలబడలేదన్నారు. అథ్లెట్లకు సంఘం మద్దతు ఉండాలన్నారు.