వారం రోజుల్లో పెళ్లి.. నిద్రలోనే మృతి చెందిన యువకుడు
- నల్గొండ జిల్లా ముప్పారం గ్రామంలో ఘటన
- వారంలో పెళ్లి ఉందనంగా విషాదం
- ఒక్కగానొక్క కొడుకు దూరమైనందుకు తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు
తల్లిదండ్రులతోనే ఉంటూ పొలం పనులు చూసుకుంటూ ఉంటాడు. గత నెల 18న బంధువుల అమ్మాయితో శివకు వివాహం నిశ్చయమైంది. శనివారం పెళ్లి దుస్తులు కొనుగోలు చేయాలనుకున్నారు. ఆ రోజు ఉదయాన్నే కుమారుడిని నిద్రలేపేందుకు ప్రయత్నించగా లేవలేదు. కుటుంబసభ్యులు, చుట్టుపక్కల వారు ఎంత ప్రయత్నించినా అతడిలో చలనం లేకపోవడంతో చనిపోయినట్టు నిర్ధారించుకున్నారు. ఒక్కగానొక్క కొడుకు మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. యువకుడి మృతికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు.