శ్రీలంకతో తొలి వన్డే టై అవడంతో భారత్ ఖాతాలో చేరిన ఓ రికార్డు
- వన్డేల్లో అత్యధిక టై మ్యాచ్‌లు నమోదు చేసిన రెండవ జట్టుగా నిలిచిన టీమిండియా
- ఇప్పటివరకు భారత్ ఆడిన వన్డేల్లో టైగా ముగిసిన 10 మ్యాచ్‌లు
- 11 టై మ్యాచ్‌లతో అగ్రస్థానంలో నిలిచిన వెస్టిండీస్
శ్రీలంకతో జరిగిన తాజా వన్డేతో కలుపుకొని ఇప్పటివరకు భారత్ ఆడిన మ్యాచ్‌ల్లో 10 టైగా ముగిశాయి. మొత్తం 11 టై మ్యాచ్‌లతో వెస్టిండీస్ అగ్రస్థానంలో ఉండగా భారత్ రెండవ స్థానానికి చేరింది. ఈ క్రమంలో 9 చొప్పున టై మ్యాచ్‌లతో ఉన్న ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, పాకిస్థాన్ జట్లను భారత్ అధిగమించింది. ఇక 8 టై మ్యాచ్‌లతో జింబాబ్వే ఆ తర్వాతి స్థానంలో నిలిచింది.