పారిస్ లో ఒలింపిక్ జ్యోతి రెప్లికా చేతబూనిన మెగాస్టార్ చిరంజీవి... ఫొటో ఇదిగో!

Chiranjeevi holds Olympic tarch in Paris
  • నిన్న పారిస్ లో అత్యంత ఘనంగా ఒలింపిక్స్ ప్రారంభోత్సవం
  • కుటుంబ సమేతంగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి
  • సురేఖతో కలిసి ఒలింపిక్ టార్చ్ ప్రతిరూపాన్ని చేతబూనడం సంతోషాన్నిచ్చిందని వెల్లడి
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సమేతంగా పారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్, ఉపాసన నిన్న జరిగిన పారిస్ ఒలింపిక్ ఓపెనింగ్ వేడుకల్లో సందడి చేశారు. అంతేకాదు, చిరంజీవి ఒలింపిక్ జ్యోతి (ఒలింపిక్ టార్చ్ రెప్లికా) ప్రతిరూపాన్ని చేతబూనారు. దీనికి సంబంధించిన ఫొటోను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. 

"పారిస్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలకు హాజరు కావడం నిజంగా సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. సురేఖతో కలిసి ఒలింపిక్ జ్యోతి ప్రతిరూపాన్ని చేతబూనిన క్షణాలు ఎంతో సంతోషాన్ని కలిగించాయి. మన భారత జట్టులోని ప్రతి క్రీడాకారుడు అత్యుత్తమంగా రాణించాలని కోరుకుంటున్నాను. భారత్ కు గతంలో ఎన్నడూ రానన్ని పతకాలు గెలవాలని ఆకాంక్షిస్తున్నాను... జై హింద్" అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.
Advertisement
Chiranjeevi
Olympic Torch
Opening Ceremony
Paris Olympics
France
Tollywood

More Telugu News