పారిస్‌లో భారత బృందానికి పీవీ సింధు నాయకత్వం.. తొలిసారి నదిపై సంబరాలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పారిస్‌లో భారత బృందానికి పీవీ సింధు నాయకత్వం.. తొలిసారి నదిపై సంబరాలు

PV Sindhu and Sharath Kamal lead Indian contingent at Paris Olympics 2024
  • అట్టహాసంగా ప్రారంభమైన పారిస్ ఒలింపిక్స్
  • సీన్ నదిపై 85 పడవల్లో 6,800 మంది అథ్లెట్ల పరేడ్
  • 84 మందితో కూడిన భారత బృందానికి సింధు, శరత్ కమల్ నాయకత్వం
ఫ్యాషన్ రాజధాని పారిస్‌లో ఒలింపిక్ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఒలింపిక్స్ చరిత్రలోనే తొలిసారి నదిలో జరిగిన సంబరాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. నదిపై ఆరు కిలోమీటర్ల మేర సాగిన పరేడ్‌లో 85 పడవలపై 6,800 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. ఒలింపిక్ చరిత్రలోనే తొలిసారి ప్రారంభోత్సవ కార్యక్రమంలో అత్యధిక మంది పాల్గొన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్, అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు థామస్ బాక్ సహా దిగ్గజ అథ్లెట్లు, వేర్వేరు రంగాలకు చెందిన వారు ఇందులో పాల్గొన్నారు.

ఫ్రెంచ్ అక్షర క్రమంలో ఆయా దేశాలు పరేడ్‌లో పాల్గొనగా భారత్ 84వ దేశంగా పరేడ్‌లో పాల్గొంది. భారత బృందానికి హైదరాబాద్ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, శరత్‌కుమార్ నేతృత్వం వహించారు. త్రివర్ణ పతాకం చేబూనగా, అథ్లెట్లు చేతుల్లో చిన్నిచిన్న మువ్వన్నెల పతాకాలు ధరించారు. తొలుత గ్రీస్ బృందం పరేడ్‌లో పాల్గొనగా, ఆ తర్వాత సౌతాఫ్రికా బృందం పాల్గొంది. 84 మందితో కూడిన భారత బృందం బోటులో సీన్ నదిపై కనిపించగానే అభిమానులు తమ మద్దతు తెలుపుతూ ఉత్సాహంతో కేరింతలు కొట్టారు.  

భారత పరేడ్‌లో నీరజ్ చోప్రా వంటి స్టార్లు కనిపించకపోవడం లోటుగా అనిపించింది. కొందరు అథ్లెట్లు ఇంకా పారిస్ చేరుకోవాల్సి ఉంది. భారత హాకీ పురుషుల జట్టుతో పారిస్‌లో భారత్ పతకాల వేట ప్రారంభం కానుంది. అలాగే, స్టార్ షట్లర్ లక్ష్యసేన్, వెటరన్ టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న యాక్షన్‌కు సిద్ధంగా ఉన్నారు.
Advertisement
PV Sindhu
Sharath Kamal
Paris Olympics 2024

More Telugu News