హైదరాబాద్‌లో దారుణం.. వీధికుక్కల దాడిలో చిన్నారి దుర్మరణం
ఇది గమనించిన కుటుంబసభ్యులు చిన్నారిని హుటాహుటీన స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లగా చిన్నారి విహాన్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న చిన్నారి ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు గుండెలు బద్దలయ్యేలా రోదించడం అక్కడున్న వారిని కంటతడి పెట్టేలా చేసింది.