తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం: వాతావరణ శాఖ
- ఉత్తర, ఈశాన్య ప్రాంతాల్లో వర్షాలు కురవవచ్చునని వెల్లడి
- షియర్ జోన్ ప్రభావంతో వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ
- నేటి సాయంత్రం హైదరాబాద్‌లో భారీ వర్షం
నేడు కరీంనగర్, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆయా జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, ఖమ్మం, జనగాం, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ జిల్లాల్లో ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.