ఆత్మహత్య ఆలోచనలు వేధించాయి.. సమస్యలు ఏకరువు పెట్టిన షణ్ముఖ్ జస్వంత్
- మానసిక సమస్య గంటల్లో తీరిపోయేది కాదన్న యూట్యూబ్ స్టార్
- సమస్యలను ఎదుర్కొంటేనే మనకు కావాల్సింది దొరుకుతుందని వ్యాఖ్య
- తన అనుభవంలో ఇవన్నీ అర్థం చేసుకున్నానన్న షణ్ముఖ్
మానసిక ఒత్తిడి అనే సమస్య గంటలు, రోజుల్లో తీరిపోయేది కాదని, అది చాలాకాలం పాటు వేధిస్తుందని షణ్ముఖ్ పేర్కొన్నాడు. ఈ క్రమంలో ఎన్నోసార్లు ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు వచ్చాయని చెప్పుకొచ్చాడు. సమస్యలు ఎన్ని వేధించినా ప్రతిసారీ నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నానని, ఒకసారి మనం ఆత్మహత్య చేసుకుంటే ఈ ప్రపంచంలో మన కుటుంబం తప్ప మరెవరూ పట్టించుకోరని పేర్కొన్నాడు.
ఏదైనా సమస్య ఉంటే దానిని ధైర్యంగా ఎదుర్కోవాలని షణ్ముఖ్ చెప్పుకొచ్చాడు. దేవుడు కష్టాలు పెట్టి పరీక్షిస్తూనే ఉంటాడని, ఎలాంటి సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొంటేనే మనకు కావాల్సింది దొరుకుతుందని చెప్పుకొచ్చాడు. తన అనుభవంలో ఇవన్నీ అర్థం చేసుకున్నానని, మీరు స్ట్రాంగ్ కాబట్టి ఏదైనా చేయగలరని పేర్కొన్నాడు.