పవన్ కల్యాణ్ ఆ బాధ్యత తీసుకోవాల్సిందే: మాజీ మంత్రి దాడిశెట్టి రాజా
- కాపులను బీసీల్లో చేర్చాలని పవన్ కు దాడిశెట్టి విన్నపం
- ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు కూడా హామీ ఇచ్చారని వ్యాఖ్య
- కాపు రిజర్వేషన్లకు కేంద్రం కూడా సానుకూలంగా ఉందన్న దాడిశెట్టి
2019 ఎన్నికల ప్రచారంలో కాపులను బీసీల్లో చేర్చడంపై చంద్రబాబు హామీ ఇచ్చారని దాడిశెట్టి రాజా గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇద్దరూ కాపులకు న్యాయం చేయాలని విన్నవించారు. కాపులకు రిజర్వేషన్లను కల్పించడంపై కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉందని... ఈ నేపథ్యంలో కేంద్రంపై కూటమి నేతలు మరింత ఒత్తిడి చేసి కాపులను బీసీల్లో చేర్చాలని కోరారు.