ముగిసిన ముఖ్యమంత్రుల సమావేశం... సమస్యల పరిష్కారం కోసం కీలక నిర్ణయం!
- సమస్యల పరిష్కారం కోసం రెండు కమిటీలు వేయాలని నిర్ణయం
- అధికారులతో ఓ కమిటీ, మంత్రులతో మరో కమిటీ వేయాలని నిర్ణయం
- 1.45 గంటల పాటు సాగిన ముఖ్యమంత్రుల సమావేశం
ముఖ్యమంత్రుల సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారం కోసం రెండు కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇరు రాష్ట్రాలకు చెందిన మంత్రులతో ఒక కమిటీని, అధికారులతో మరో కమిటీని వేయాలని నిర్ణయించారు. రెండు రాష్ట్రాల మధ్య సామరస్యపూర్వకంగా చర్చ సాగింది. ఇరు రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలగకుండా పరిష్కారాలు ఉండాలని నిర్ణయించారు.