సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ వివాదం.. వెలుగులోకి కొత్త వీడియో!
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో సూర్యకుమార్ పట్టిన క్యాచ్‌పై దుమారం
- సూర్య కాలు బౌండరీలైన్‌ను తాకిందంటూ వీడియోలు
- తాజాగా మరో కోణంలోని వీడియో వెలుగులోకి
- ఫెయిర్‌గానే క్యాచ్.. వివాదానికి ఇక ఫుల్‌స్టాప్
కానీ, హార్దిక్ పాండ్యా వేసిన పుల్‌టాస్‌ను బలంగా బాదిన మిల్లర్ బౌండరీ వద్ద సూర్యకుమార్‌కు దొరికిపోయాడు. ఈ క్యాచ్‌కు సంబంధించి పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే, తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియో అది ఫెయిర్ క్యాచేనని, అందులో ఎలాంటి వివాదం లేదని తేల్చేసింది. ఈ వీడియో సూర్యకుమార్ కాలు బౌండరీ లైన్‌కు కొద్ది దూరంలో ఉండడం స్పష్టంగా కనిపించింది. మరి ఈ వీడియోతోనైనా వివాదానికి ఫుల్‌స్టాప్ పడుతుందేమో చూడాలి.