రామోజీరావులా ఒక్కరోజు జీవించగలిగినా చాలు: కీరవాణి
- నేడు విజయవాడలో రామోజీరావు సంస్మరణ సభ
- హాజరైన కీరవాణి, రాజమౌళి
- సంగీత దర్శకుడిగా రామోజీరావు తనకు జన్మనిచ్చారన్న కీరవాణి
ఈ కార్యక్రమంలో కీరవాణి ప్రసంగిస్తూ, మహోన్నతమైన వ్యక్తిత్వానికి రామోజీరావు ప్రతీక అని కొనియాడారు. ఆయనలా ఒక్కరోజు జీవించగలిగినా చాలు అనిపిస్తుందని వ్యాఖ్యానించారు. రామోజీరావు సంగీత దర్శకుడిగా తనకు జన్మనిచ్చారని, ఉషా కిరణ్ మూవీస్ లో మనసు-మమత చిత్రంతో సంగీత దర్శకుడిగా తన ప్రస్థానం మొదలైందని కీరవాణి గుర్తు చేసుకున్నారు. రామోజీరావు వద్ద ఎన్నో విషయాలు నేర్చుకున్నానని తెలిపారు.