అమ్మ, అక్క బూతులు ఆపు.. భార్యకు గోవిందా సీరియస్ వార్నింగ్!
- భార్య సునీత వాడే భాషపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన గోవిందా
- అమ్మ, అక్క అంటూ బూతులు వాడటం ఆపాలని బహిరంగంగా హెచ్చరిక
- యువ నటితో గోవిందా సన్నిహితంగా ఉండటంతో మొదలైన వివాదం
- భర్తను 'షుగర్ డాడీ' అంటూ సునీత చేసిన వ్యాఖ్యలతో గొడవ తీవ్రం
- ప్రజలు సెలబ్రిటీలను అనుసరిస్తారని, పద్ధతిగా మెలగాలని భార్యకు హితవు
బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా, ఆయన భార్య సునీత అహుజా మధ్య కొంతకాలంగా నడుస్తున్న మనస్పర్థలు ఇప్పుడు తారాస్థాయికి చేరాయి. తన భార్య వాడే భాషపై గోవిందా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యంగా అమ్మ, అక్క అంటూ బూతులు వాడటం వెంటనే ఆపాలని బహిరంగంగా హెచ్చరించారు. ఈ మేరకు ఆయన విడుదల చేసిన ఓ వీడియో ఇప్పుడు బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.
ఓ వీడియో సందేశంలో సునీతను ఉద్దేశించి గోవిందా మాట్లాడుతూ.. "సునీతా జీ.. ఈ మధ్య మీరు అమ్మా, చెల్లి అంటూ బూతులు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. దయచేసి దాన్ని ఆపండి. సెలబ్రిటీలుగా మనల్ని చూసి యువత ఎంతో నేర్చుకుంటుంది. వాళ్లు కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తే ఎలా? రేపు మన అమ్మను, చెల్లిని ఎవరైనా తిడితే మనం సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది. దయచేసి ఇలా చేయకండి" అని హితవు పలికారు.
"అమ్మా, చెల్లి అనే పవిత్రమైన పదాలను మీ మాటలతో చౌకబారు ('సస్తా') చేసేశారు. మీ నుంచి ఇలాంటి ప్రవర్తనను ఊహించలేదు" అని గోవిందా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇటీవల గోవిందా వ్యక్తిగత జీవితంపై, ముఖ్యంగా ఆయన ఎఫైర్ల ఆరోపణలపై సునీత బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొత్త నటి కోమల్ రాణి స్వర్ణకర్‌తో గోవిందా సన్నిహితంగా ఉంటున్నారనే వార్తలు గుప్పుమన్నాయి. ఇటీవల ఎయిర్‌పోర్టులో వీరిద్దరూ కలిసి కనిపించడంతో ఈ వివాదం మరింత ముదిరింది.
దీనిపై స్పందించిన సునీత, తన భర్తను 'షుగర్ డాడీ' అంటూ ఘాటుగా విమర్శించారు. "కూతురి వయసున్న అమ్మాయితో తిరుగుతున్నాడు, సిగ్గుచేటు" అని ఆమె వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా, కోమల్‌ను ఉద్దేశిస్తూ "నీ షుగర్ డాడీ చాలా ధనవంతుడు కాబట్టి, నువ్వు మంచి బట్టలు వేసుకొని నీట్‌గా రెడీ అవ్వాలి" అంటూ పరోక్షంగా చురకలు అంటించారు.
కోమల్‌తో కలిసి గోవిందా 'రూప' అనే సినిమాను ప్రమోట్ చేయడంపై ప్రశ్నించగా.. "ముందు ఆ సినిమా పూర్తి కావాలి కదా. ఆ తర్వాతే ప్రమోషన్" అని సునీత ఎద్దేవా చేశారు. గతంలో 'లాక్ అప్' అనే రియాలిటీ షోలో పాల్గొన్నప్పుడు కూడా సునీత సంభాషణల్లో తరచూ బూతులు వాడటంపై విమర్శలు వచ్చాయి. బహుశా ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలోనే గోవిందా ఇప్పుడు బహిరంగంగా స్పందించినట్లు తెలుస్తోంది.