Megastar: తండ్రి ఫొటోతో చిరు.. కూతురును ఎత్తుకుని చెర్రీ.. ఫాదర్స్ డే శుభాకాంక్షలు

Megastar Rare Pic With His Father Shared by Chiru
షార్ట్స్‌లో చూడండి
ఫాదర్స్ డే సందర్భంగా మెగా ఫ్యామిలీ నుంచి రెండు అరుదైన ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. స్వయంగా మెగాస్టార్ చిరంజీవి ఓ అరుదైన ఫొటో పంచుకుంటూ అభిమానులకు ఫాదర్స్ డే శుభాకాంక్షలు చెప్పారు. మరో ఫొటోలో మెగాస్టార్ తనయుడు మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ తన కూతురుతో కలిసి ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆదివారం ఫాదర్స్ డే సందర్భంగా సోషల్ మీడియాలో సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా తమ తండ్రితో కలిసి దిగిన ఫొటోను షేర్ చేస్తూ శుభాకాంక్షలు చెబుతున్నారు.

మెగాస్టార్ చిరంజీవి తన తండ్రి కొణిదెల వెంకటరావుతో కలిసి దిగిన పాత చిత్రాన్ని షేర్ చేశారు. ‘ప్రతీ బిడ్డకూ మొదటి హీరో తండ్రే.. అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు’ అంటూ క్యాప్షన్ జోడించారు. ఈ ఫొటోను చూసి మెగాస్టార్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు, మెగాస్టార్ చిరంజీవి తనయుడు రాంచరణ్ కూడా ఓ ఫొటోను షేర్ చేశాడు. తన కూతురు క్లీంకారను ఎత్తుకుని తననే చూస్తుండగా ఓ పక్కనుంచి వారిద్దరినీ ఫొటో తీశారు. ఈ ఫొటోను రాంచరణ్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. మెగా ఫ్యామిలీకి చెందిన ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Go Back to Shorts
Megastar
Chiranjeevi
Fathers day Wishes
Ramcharan
Klin kara
Special Pics
Viral Pics

More Telugu News