Kunal Kapoor: చిరంజీవి 'విశ్వంభర' సెట్స్ పై అడుగుపెట్టిన బాలీవుడ్ నటుడు

Bollywood actor Kunal Kapoor joins Vishwambhara sets
షార్ట్స్‌లో చూడండి
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో యువ దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న చిత్రం 'విశ్వంభర'. దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న ఈ సోషియో ఫాంటసీ చిత్రంలో బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ కూడా నటిస్తున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం నేడు అధికారికంగా ప్రకటించింది. కునాల్ కపూర్ సెట్స్ పై అడుగుపెట్టాడని వెల్లడించింది. 

కాగా, కునాల్ 'విశ్వంభర' చిత్రంలో ప్రతినాయకుడిగా నటిస్తున్నట్టు సమాచారం. అతడే విలన్ అని రివీల్ అయ్యే సీన్ సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన త్రిష, ఆషికా రంగనాథ్ నటిస్తున్నారు. 

'విశ్వంభర' చిత్రం 2025 సంక్రాంతి సీజన్ లో విడుదల కానుంది. చిత్రబృందం జనవరి 10వ తేదీని రిలీజ్ డేట్ గా ఇప్పటికే లాక్ చేసింది. ఈ సినిమా షూటింగ్ జులై నాటికి పూర్తి కానుండగా, కథను అనుసరించి గ్రాఫిక్స్ కోసం ఎక్కువ సమయం కేటాయించనున్నారు.
Go Back to Shorts
Kunal Kapoor
Vishvambhara
Chiranjeevi
Vasishta
Tollywood
Bollywood

More Telugu News