చంద్రబాబు కాన్వాయ్ వెంట పరుగులు తీసిన మహిళ.. కారు ఆపి మాట్లాడిన టీడీపీ అధినేత.. ఇదిగో వీడియో!
- విజయవాడలో కూటమి ఎమ్మెల్యేల సమావేశానికి వెళ్లిన టీడీపీ అధినేత
- సమావేశం అనంతరం ఉండవల్లికి తిరుగు పయనమైన చంద్రబాబు
- ఆయనను చూసేందుకు ఓ మహిళ కాన్వాయ్ వెంట పరుగులు
- అది గమనించిన చంద్రబాబు వెంటనే కాన్వాయ్ ను ఆపి ఆమెతో మాట్లాడిన వైనం
సెక్యూరిటీని వారించి ఆమె వివరాలు తెలుసుకున్నారు. తనది మదనపల్లి అని, తన పేరు నందిని అని ఆమె తెలిపారు. టీడీపీ గెలుపు కోసం రేయింబవళ్లు శ్రమించానని ఆమె తెలపడంతో బాబు థాంక్స్ చెప్పారు. చంద్రబాబు గారిపై అభిమానంతో 104 డిగ్రీల జ్వరం ఉన్నప్పటికీ చూడడానికి వచ్చానని ఆమె చెప్పడంతో ఆరోగ్యం చూసుకోవాలని, ఆసుపత్రికి వెళ్లాలని చంద్రబాబు సూచించారు. "మా కష్టం ఫలించి.. మా కోరిక మేరకు మీరు సీఎం అయ్యారు సార్! ఒక్కసారి మీ కాళ్లు మొక్కుతాను" అంటూ ఆ మహిళ ముందుకు రాగా చంద్రబాబు సున్నితంగా వారించి, ఆప్యాయంగా ఆమెతో ఫోటో దిగారు.