కేంద్రమంత్రిగా రామ్మోహన్ నాయుడు ప్రమాణం
- శ్రీకాకుళం నుంచి వరుసగా మూడోసారి గెలిచిన రామ్మోహన్
- మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లకు కృతజ్ఞతలు తెలిపిన ఎంపీ
- టీడీపీ నుంచి ఇద్దరికి కేబినెట్లో అవకాశం
ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. తాను ఎన్డీయే ప్రభుత్వంలో ఈరోజు కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశానని పేర్కొన్నారు. తనకు అవకాశం కల్పించిన ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌లకు, అలాగే తనను గెలిపించి పార్లమెంట్‌కు పంపించిన ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ రాసుకొచ్చారు.