బెంగళూరు రేవ్ పార్టీలో కీలక పాత్ర... సినీ నటి హేమ అరెస్ట్
- గత నెల 20న బెంగళూరులో రేవ్ పార్టీ
- విచారణకు హాజరు కావాలని మూడుసార్లు సీసీబీ నోటీసులు
- మూడోసారి నోటీసుతో ఈరోజు విచారణకు హాజరైన హేమ
- విచారణ అనంతరం అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఉదయం నుంచి ఆమెను సీసీబీ పోలీసులు విచారించారు. అనంతరం ఆమెను అరెస్ట్ చేశారు. రేవ్ పార్టీ నిర్వహణలో ఆమె కీలక పాత్ర వహించినట్లుగా పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తోంది.
మీడియా కంటపడకుండా బుర్ఖాలో వచ్చిన హేమ
హేమ మీడియా కంటపడకుండా ఉండేందుకు బుర్ఖాలో వచ్చారు. ఆమెకు ఆ బుర్ఖాలోనే వైద్య పరీక్షలు నిర్వహించారు. హేమతో పాటు మరొకరిని సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్ సప్లయర్ ఇమ్రాన్ షరీఫ్‌ను అరెస్ట్ చేశారు. బెంగళూరు రేవ్ పార్టీకి ఇమ్రాన్ డ్రగ్స్ సరఫరా చేశారు.