తీన్మార్ మల్లన్నపై కేటీఆర్ వ్యాఖ్యలు... ఈసీకి ఫిర్యాదు చేస్తామన్న మల్లు రవి
- తీన్మార్ మల్లన్నపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన మల్లు రవి
- తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ అభ్యర్థిగా అర్హుడని ఈసీ తెలిపిందని వ్యాఖ్య
- కేటీఆర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్
ఈ వ్యాఖ్యలకు మల్లు రవి శనివారం కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్లన్న అర్హుడని ఈసీ తెలిపిందన్నారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదు చేస్తామన్నారు. తీన్మార్ మల్లన్నపై చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలపై ఈసీ కూడా చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఆవిర్భావ ఉత్సవాలకు సోనియా గాంధీ వస్తున్నారని మల్లు రవి తెలిపారు. తెలంగాణ ఇచ్చిన నాయకురాలిగా ఆమెను ఘనంగా సన్మానిస్తామన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో పని చేసిన అన్ని పార్టీలను ఈ ఉత్సవాలకు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.