నీట్ నిరసనల వేళ శశిథరూర్ ఆసక్తికర రీపోస్ట్.. బాలీవుడ్ మౌనంపై చర్చ!
- 2012 నాటి అమితాబ్ ట్వీట్‌ను పంచుకున్న థరూర్
- ప్రశాంత నిరసనకారులపై లారీచార్జ్ దృశ్యాలపై అమితాబ్ ఆవేదన
- ప్రస్తుత నీట్ ఆందోళనలపై బాలీవుడ్ మౌనంపై చర్చ
- విద్యార్థులకు పలువురు చలనచిత్ర ప్రముఖుల మద్దతు
నీట్ పరీక్ష పేపర్ లీకేజీకి నిరసనగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు జరిపిన లాఠీచార్జ్, నిర్బంధ చర్యలపై రాజకీయ వివాదం మరింత ముదురుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ ఎంపీ శశి థరూర్ సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక రీపోస్ట్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలో 2012లో యుపీఏ ప్రభుత్వ హయాంలో ఢిల్లీలో నిరసనకారులపై పోలీసుల చర్యలను విమర్శిస్తూ బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ చేసిన ఒక పాత ట్వీట్‌ను థరూర్ తన 'ఎక్స్' ఖాతాలో ఎలాంటి అదనపు వ్యాఖ్యలు జోడించకుండా రీపోస్ట్ చేశారు.
నాటి అమితాబ్ బచ్చన్ ట్వీట్‌లో.. "ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే చాలా బాధగా, తీవ్ర దిగ్భ్రాంతిగా ఉంది.. శాంతియుతంగా జరుగుతున్న నిరసనలపై బాష్పవాయు గోళాలు, వాటర్ క్యానన్లను ఉపయోగిస్తున్నారు" అని పేర్కొన్నారు. 2012 డిసెంబర్‌లో ఢిల్లీలో జరిగిన భయానక సామూహిక అత్యాచార ఘటనకు నిరసనగా ఇండియా గేట్, రైసినా హిల్ వద్ద ప్రజలు ఆందోళన చేసిన సమయంలో బిగ్ బీ ఈ విధంగా స్పందించారు. అయితే, ప్రస్తుత నీట్ విద్యార్థుల పోరాటంపై అమితాబ్‌తో సహా బాలీవుడ్‌కు చెందిన పలువురు అగ్ర నటులు మౌనంగా ఉండటాన్ని గుర్తు చేస్తూ, చిత్ర పరిశ్రమ వైఖరిలోని వైరుధ్యాన్ని ఎత్తిచూపేందుకే థరూర్ ఈ రీపోస్ట్ చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రస్తుత నిరసనలకు షబానా అజ్మీ, ప్రకాశ్ రాజ్, స్వర భాస్కర్ వంటి కొద్దిమంది నటులు జంతర్ మంతర్ వద్దకు వచ్చి నేరుగా మద్దతు ప్రకటించారు. అలాగే హుమా ఖురేషి, నసీరుద్దీన్ షా, సోనాక్షి సిన్హా, అభయ్ డియోల్ తదితరులు ఆన్‌లైన్ ద్వారా విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. ప్రితీ జింటా, భూమి పెడ్నేకర్ వంటి నటీమణులు హింసకు తావులేకుండా విద్యార్థుల సమస్యల పరిష్కారంపైనే దృష్టి పెట్టాలని కోరారు.