రోజూ చాయ్‌తో బిస్కెట్ తింటున్నారా? గట్ హెల్త్‌కు చాలా ప్రమాదం!
- తరచూ చాయ్‌తో బిస్కెట్లు తింటే జీర్ణవ్యవస్థ దెబ్బతినే ప్రమాదం
- పేగుల్లో ఉండే రక్షణ పొర బలహీనపడే అవకాశం
- వర్షాకాలంలో జీర్ణవ్యవస్థ సున్నితత్వం వల్ల మరిన్ని సమస్యలు
- బిస్కెట్లలోని మైదా, చక్కెర వల్ల పేగుల్లో హానికరమైన బ్యాక్టీరియా పెరిగే ఛాన్స్
- శనగలు, మొలకల సలాడ్, మఖానా, నట్స్, పండ్లు తీసుకోవడం మేలు
వేడి వేడి టీతో పాటు రెండు మూడు బిస్కెట్లు తినడం చాలా మందికి అలవాటు. వర్షాకాలంలో అయితే ఈ కాంబినేషన్ మరింత ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అయితే ఈ చిన్న అలవాటే పేగుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మైదా, చక్కెర, ప్రాసెస్ చేసిన నూనెలు, కృత్రిమ పదార్థాలు ఉన్న బిస్కెట్లను తరచూ టీతో కలిపి తినడం వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతినడంతో పాటు పేగుల రక్షణ పొర (Gut Barrier) బలహీనపడే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
రక్షణ పొర ఎందుకు ముఖ్యం?
పేగుల లోపలి భాగంలో ఉండే రక్షణ పొర శరీరంలోకి హానికరమైన బ్యాక్టీరియా, వైరస్‌లు ప్రవేశించకుండా అడ్డుకుంటుంది. అదే సమయంలో ఆహారంలోని పోషకాలను శరీరం సరిగా గ్రహించేందుకు కూడా ఇది సాయపడుతుంది. ఈ పొర దెబ్బతింటే జీర్ణ సమస్యలతో పాటు రోగనిరోధక శక్తిపైనా ప్రభావం పడుతుంది.
వర్షాకాలంలో సమస్య ఎందుకు ఎక్కువ?
వర్షాకాలంలో అధిక తేమ, శారీరక శ్రమ తగ్గడం, జీర్ణక్రియ మందగించడం, ఆహారంలో బ్యాక్టీరియా పెరిగే అవకాశం వంటి కారణాలతో జీర్ణవ్యవస్థ సున్నితంగా మారుతుంది. అలాంటి సమయంలో టీ-బిస్కెట్ తీసుకోవడం వల్ల ఉబ్బరం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
ఈ కాంబినేషన్ ఎందుకు ప్రమాదకరం?
బిస్కెట్లలో ఉండే మైదాలో పీచు పదార్థం చాలా తక్కువగా ఉంటుంది. దీంతో జీర్ణక్రియ సరిగా జరగదు. అలాగే చక్కెర ఎక్కువగా ఉండటం వల్ల పేగుల్లో హానికరమైన బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంది. మరోవైపు టీలోని కెఫిన్ ఖాళీ కడుపుతో లేదా ఎక్కువగా తీసుకుంటే ఎసిడిటీ, కడుపులో మంట వంటి సమస్యలను పెంచుతుంది. ఈ రెండూ కలిసినప్పుడు పేగులపై ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?
టీ-బిస్కెట్ అలవాటు వల్ల పేగుల ఆరోగ్యం దెబ్బతింటే కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. తరచూ కడుపుబ్బరం, గ్యాస్ సమస్య, ఎసిడిటీ, అజీర్ణం, భోజనం తర్వాత కడుపు బరువుగా అనిపించడం, మల విసర్జనలో మార్పులు, అలసట.. ఈ సమస్యలు తరచూ ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.
పేగులకు మేలు చేసే ఆహారం
పేగుల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఇంట్లో చేసిన పెరుగు, పులియబెట్టిన ఆహారాలు, అరటిపండ్లు, ఓట్స్, పప్పుధాన్యాలు, ఉడికించిన కూరగాయలు, నట్స్, విత్తనాలను ఆహారంలో చేర్చుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే అల్లం టీ, జీలకర్ర నీరు, సోంపు నీరు వంటి పానీయాలు కూడా జీర్ణక్రియకు తోడ్పడతాయి.
టీ-బిస్కెట్‌కు బదులు ఇవి తీసుకోండి
బిస్కెట్లకు బదులుగా వేయించిన శనగలు, మొలకల సలాడ్, మఖానా, నట్స్, పండ్లు లేదా హోల్‌గ్రెయిన్ బ్రెడ్‌తో తయారు చేసిన వెజిటబుల్ శాండ్‌విచ్ వంటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకోవడం మంచిది.