Advertisement

పిన్నెల్లిపై తప్పుడు వీడియో రిలీజ్ చేసిన లోకేశ్ పై విచారణ జరపాలి: మంత్రి అంబటి రాంబాబు

Ambati Rambabu demands investigation on Lokesh
  • పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో వైరల్
  • ఈ వీడియోతో సంబంధం లేదని ఈసీ ప్రకటించిందన్న అంబటి
  • పోలీసులు, అధికారులు తెలుగుదేశంతో కుమ్మక్కయ్యారని వ్యాఖ్యలు
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన వ్యవహారంపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. వైరల్ అవుతున్న మాచర్ల ఎమ్మెల్యే వీడియోతో సంబంధం లేదని ఈసీ ప్రకటించిందని, దీన్ని బట్టి పోలీసులు, అధికారులు తెలుగుదేశంతో ఎంతగా కుమ్మక్కయ్యారో తెలుస్తోందని అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. ఎమ్మెల్యే పిన్నెల్లిపై తప్పుడు వీడియోను ఎక్స్ లో రిలీజ్ చేసిన నారా లోకేశ్ పై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
Advertisement
Ambati Rambabu
Pinnelli Ramakrishna Reddy
Nara Lokesh
EVM
Video
YSRCP
TDP

More Telugu News