హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం!
Advertisement

హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం!

Heavy Rain in Hyderabad
  • న‌గ‌రంలో ప‌లుచోట్ల ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షం
  • సైదాబాద్, కొత్త‌పేట‌, నాగోల్, చైత‌న్యపురి, రాజేంద్ర‌న‌గ‌ర్ త‌దిత‌ర ప్రాంతాల్లో వాన‌
  • హైద‌రాబాద్ న‌గ‌ర‌వాసుల‌కు వేస‌వి ఉక్క‌పోత నుంచి ఉప‌శ‌మ‌నం
హైద‌రాబాద్ న‌గ‌ర‌వాసుల‌కు వేస‌వి ఉక్క‌పోత నుంచి ఉప‌శ‌మ‌నం క‌లిగించేలా ప‌లుచోట్ల శ‌నివారం ఉద‌యం ఉరుములు, మెరుపుల‌తో కూడిన భారీ వ‌ర్షం కురిసింది. సైదాబాద్, కొత్త‌పేట‌, నాగోల్, చైత‌న్యపురి, రాజేంద్ర‌న‌గ‌ర్‌, చంపాపేట‌, తుర్క‌యాంజ‌ల్‌, సరూర్‌న‌గ‌ర్‌లో వాన ప‌డింది. దీంతో ఉద‌యం కార్యాల‌యాల‌కు వెళ్లే ఉద్యోగులు ఇక్క‌ట్లు ప‌డుతున్నారు. మ‌రోవైపు వేస‌వి ఎండ‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న న‌గ‌రవాసులు వ‌ర్షం కార‌ణంగా సేద‌తీరుతున్నారు.
Advertisement
Hyderabad
Heavy Rain
Telangana

More Telugu News